కేంద్రమంత్రికి సీఎం ఘన స్వాగతం
కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఘనస్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయానికి వెళ్లిన సీఎం, కేంద్ర మంత్రులు ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్న రాజ్ నాథ్ సింగ్ కు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. అనంతరం వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గాన వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం దామగుండం రాడార్ కేంద్రం భూమిపూజ కార్యక్రమానికి బయల్దేరి వెళ్లారు.

