15 సెకన్లలోనే రజనీకాంత్ మూవీ ఆడియో రిలీజ్ పాస్‌లు క్లోజ్
కోలీవుడ్ స్టైలిష్ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ 1000 ఆడియో రిలీజ్ పాస్‌లు కేవలం 15 సెకన్లలోనే అయిపోయాయి. వీటిని ఫ్యాన్స్ ఎగబడి తీసుకున్నారని చిత్రబృందం ప్రకటించింది. దీనితో ‘అదీ తలైవా రేంజంటే’ అంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. జూలై 28 న చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం జరగబోతోంది. దీనికి వెయ్యి పాసులు అభిమానులకు ఉచితం అని ప్రకటించారు. జైలర్ చిత్రం రజనీ మిగిలిన సినిమాల కంటే వెరైటీగా ఉంటుందని మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ తెలిపారు. ఈ చిత్రంలో మలయాళ ఆగ్ర హీరో మోహన్ లాల్, కన్నడ టాప్ హీరో శివరాజ్ కుమార్‌లు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. రమ్యకృష్ణ, తమన్నా, సునీల్ కూడా ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం. ఈ చిత్రం ఆగస్టు 10న విడుదల కాబోతోంది.