Home Page SliderNational

నిలకడగా ఉన్న రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి

రజనీకాంత్ పరిస్థితి ఆందోళనకరం.. ఆయన ఆసుపత్రిలో చేరారు. ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 30న సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. 73 ఏళ్ల వయస్సులో ఆయనకు కడుపునొప్పితో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. మంగళవారం నాడు జాయిన్ అయ్యేటప్పటి కంటే అతని పరిస్థితి ఇవాళ నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రముఖ నటుడు రజనీకాంత్ సెప్టెంబర్ 30, సోమవారం చివరి గంటలలో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అధికారిక మెడికల్ బులెటిన్ సాయంకాలానికి వెలువడే అవకాశం ఉంది. అతను కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు నివేదికలు సూచించాయి.