Andhra PradeshHome Page Slider

మంత్రి రోజాకు రజనీకాంత్ ఫ్యాన్స్ సీరియస్ వార్నింగ్

విజయవాడ వేదికగా జరిగిన ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతూనే ఉన్నారు. ఎన్టీఆర్‌తో పరిచయం, అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూనే.. చంద్రబాబు, బాలయ్యపై రజినీ ప్రశంసలు కురిపించడంపై వైసీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు . చంద్రబాబు విజన్‌.. హైదరాబాద్‌ అభివృద్ధి వంటి అంశాలను ప్రస్తావించడంతో సూపర్ స్టార్ వైసీపీకి టార్గెట్‌ అయ్యారు. అయితే, మంత్రి రోజా పుదుచ్చేరి పర్యటనలో రజనీకాంత్ అభిమాన సంఘం నేతలు, రోజాపై నిప్పులు చెరిగారు. రజనీకాంత్ అభిమానులు రోజాకు సీరియస్‌ వార్నింగ్ ఇచ్చారు. రజనీకాంత్‌ను విమర్శించే స్ధాయి లేదని హితవు పలికారు. చేసినా విమర్శలు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే పెద్ద ఎత్తున నిరసన చేపడుతామంటూ హెచ్చరించారు.. మరోసారి రజనీకాంత్‌పై మాట్లాడితే చూస్తూ ఊర్కోమన్నారు.