Home Page SliderTelangana

హ్యాట్రిక్ విజయం  సాధించిన రాజాసింగ్

గోషా మహల్ నుండి వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించారు బీజేపీ అభ్యర్థి రాజాసింగ్. తన సమీప బీఆర్‌ఎస్ అభ్యర్థిపై దాదాపు 18 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. బీజేపీ పార్టీపై నమ్మకంతో తనను పార్టీ నుండి సస్పెండ్ చేసినా, పార్టీ మారిపోకుండా నిలకడగా నిలిచి, మళ్లీ పార్టీ టికెట్టు పొందారు. తన స్థానాన్ని నిలబెట్టుకుని, బీజేపీకి ఎమ్మెల్యే స్థానాన్ని కట్టబెట్టారు. వరుసగా 2014, 2018, 2023 ఎన్నికలలో గెలిచి విజయ దుందుభి మ్రోగించారు రాజాసింగ్.