NationalNews Alert

మహేష్‌తో సినిమాపై రాజమౌళి కామెంట్స్

సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా తీయనున్న విషయం తెలిసిందే. రాజమౌళి సినిమా అంటేనే అభిమానుల్లో ఓ రెంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. ఇక సూపర్ స్టార్ సెన్సేషనల్ డైరెక్టర్ కలిసి చెయనున్న ఈ సినిమాకి అభిమానుల అంచనాల విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ తీయబోతున్న సినిమాపై ఇప్పటికే ఎన్నో వార్తలు , పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలో USAలో జరిగిన చిత్రోత్సవంలో పాల్గొన్న రాజమౌళి మహేష్‌తో కలిసి తాను తెరకెక్కించనున్న చిత్రంపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. మహేష్ బాబుతో తన సినిమా ప్రపంచాన్ని కదిలించే యాక్షన్ అడ్వెంచర్‌గా ఉండబోతోందని తెలిపారు.