Home Page Sliderhome page sliderNational

ముంబైని ముంచెత్తిన వాన..

ముంబైలో ఇవాళ ఉదయం ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షంతో నగరమంతా తడిసి ముద్దయింది. దీంతో సాధారణ జనజీవనం స్థంభించిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు తుఫాను కారణంగా రోడ్లపై వరదనీరు చేరి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. సబ్ అర్బన్ రైళ్లు, విమాన సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడింది. ముంబైలోని నారిమన్ పాయింట్ వద్ద అత్యధికంగా 104మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే విధంగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం వద్ద 80మి.మీ. వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు రానున్న 24 గంటల్లో నగరంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30 నుంచి 40కి లోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని తెలిపింది.