భాగ్యనగరాన్ని ముంచెత్తిన వాన
భాగ్యనగరంలో వాన బీభత్సం సృష్టించింది. దంచికొట్టిన వాన కారణంగా రోడ్లు జలశయాలను తలపించాయి. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఉరుములు , మెరుపులలో భయంకరంగా మారి కుండపోత వర్షం కురిసింది. గంట పాటు ఎడతెరపు లేకుండా కురిసిన వర్షం కారణంగా కూకట్‌పల్లి సమీపంలోని బాలానగర్‌లో ఏకంగా 10 సెం.మీ వర్షపాతం నమోదైంది. బంజారాహిల్స్ , జూబ్లీహిల్స్ , ఖైరతాబాద్ , మాసబ్ ట్యాంక్ , నాంపల్లి , ఆర్టీసీ క్రాస్ రోడ్ , రాంనగర్ , కూకట్‌పల్లి , మూసాపేట్ , నిజాంపేట్ , బాలానగర్ ప్రాంతాల్లో ఉరుములు , మెరుపులతో కురిసిన వర్షం కారణంగా ప్రయాణీకులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. ఫతేనగర్, దీన్‌దయాల్‌నగర్ కాలనీ రోడ్లు నీళ్లతో నిండిపోయి కాలినడకన వెళ్లే వారికి సైతం తీవ్ర సమస్యగా మారాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీటి ఉధృతికి ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి.

