NewsNews AlertTelangana

హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం

తెలంగాణా రాష్ట్రంలో దాదాపు మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో వర్షాలు పడుతున్నాయి. అయితే ఈ రోజు కూడా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు భారీ వర్షం కురిసింది. టోలీచౌకీ,మెహదీపట్నం,లంగర్ హౌస్‌లలో వర్షం పడింది. ప్రస్తుతం హైదరాబాద్ వాతావరణం చాలా చల్లగా ఉంది. వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు మెట్ డిపార్ట్మెంట్ పేర్కొంది.