సంక్రాంతికి రైల్వే టిక్కెట్ల బుకింగ్ క్లోజ్
AP: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేందుకు నానా కష్టాలు తప్పేలాలేవు. 4 నెలల ముందే రైళ్లలోని టికెట్లన్నీ అయిపోయాయి అని చెబుతున్న రైల్వే వారు. గౌతమి, కోణార్క్, సింహపురి, గరీబ్‌రథ్, ఫలక్‌నుమా, గోదావరి, శబరి, LTT విశాఖ, ఈస్ట్‌కోస్ట్, చార్మినార్, వందేభారత్ రైళ్లలో జనవరి 10, 11, 12 తేదీల్లో వెయిటింగ్ లిస్టు వందల్లో ఉంది. ఇంక రైల్వేవారు దయతలచి స్పెషల్ ట్రైన్లు వేస్తేనే ప్రయాణికులకు కొంత సౌలభ్యం లభించేలా ఉంది. అదియును రైల్వే వారు ముందు చూపుతో ఇప్పటి నుండే ప్లాన్ చేసుకుని స్పెషల్ ట్రైన్ టిక్కెట్లను కూడా ఇప్పుడే ప్రకటిస్తే కొంత ప్రయాణికులకు ఉపశమనం లభిస్తుంది. ముందుగానే ప్రత్యేక రైళ్ల జాబితా విడుదల చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

