ఘోరం..షంటింగ్ ఆపరేషన్‌లో రైల్వే ఉద్యోగి మృతి
బీహార్‌లోని బరౌని రైల్వే స్టేషన్‌లో దారుణం జరిగింది. ఈ రోజు జరిగిన షంటింగ్ ఆపరేషన్‌లో రైల్వే ఉద్యోగి పోర్టర్ అమర్ కుమార్ రావు మృతి చెందారు. లక్నో-బరౌనీ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజన్- బోగీల మధ్య కప్లింగ్ విడదీసేందుకు ప్రయత్నిస్తూ రైలు అనుకోని రీతిలో రివర్స్ కావడంతో రెండు క్యారేజీల మధ్య ఇరుక్కుపోయి మృతి చెందాడు. దీనితో రైలు డ్రైవర్ పరారీ అయ్యాడు.

