కోర్టు తీర్పు, అనర్హత వేటు తర్వాత రాహుల్ తొలి ప్రెస్‌మీట్
దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అదానీ కోసం రూల్స్ మారిపోతున్నాయని చెప్పారు. జైల్లో పెడితేనో, అనర్హత వేస్తే నేను చూస్తూ ఊరుకోబోనన్నారు. 20 వేల కోట్ల రూపాయలు అదానీ కంపెనీల్లో ఎలా పెట్టించారని ప్రశ్నిస్తున్నానన్నారు. తనపై ఎంతగా కక్షగట్టినా… దేశం కోసం పోరాడుతూనే ఉంటానన్నారు రాహుల్ గాంధీ. ప్రధాన మంత్రిని పార్లమెంట్‌లో ఓ ప్రశ్న అడిగా… 20 వేల రూపాయలు అదానీ గ్రూపుల్లో ఎందుకు పెట్టించారని ప్రశ్నించా… షెల్ కంపెనీల్లో ఎందుకు పెట్టించారని అడిగానన్నారు రాహుల్ గాంధీ. అదానీతో ఉన్న రిలేషన్‌షిప్ ఏంటో చెప్పాలని ప్రధాని మోడీని డిమాండ్ చేశానన్నారకు. ఎయిర్ పోర్టులు ఎందుకు ఆయనకే ఇస్తున్నారని ప్రశ్నించా… విదేశాల్లో ఆయనకు ప్రాజెక్టులు ఎలా వచ్చాయో చెప్పాలని కోరానన్నారు రాహుల్ గాంధీ. అదానీ కోసం దేశంలో రూల్స్ మారిపోతున్నాయని వివరించారు రాహుల్ గాంధీ. పార్లమెంట్ వేదికగా మంత్రులు అబద్ధాలు చెబుతున్నారన్నారు రాహుల్ గాంధీ.

