రాహుల్ టీ షర్ట్ @ రూ.41,257
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’ యాత్ర ప్రారంభంలోనే వివాదాస్పదమైంది. ‘ధరల పెరుగుదల, నిరుద్యోగానికి వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ ధరించిన టీ షర్ట్ ధర ఎంతో తెలుసా.. ఏకంగా 41,257 రూపాయలు. బర్‌బెర్రీ బ్రాండ్‌కు చెందిన అత్యంత ఖరీదైన టీ షర్ట్ ధరించి పాదయాత్ర చేస్తున్న రాహుల్‌కు పేదల కష్టాలు ఏం తెలుస్తాయి..?’ అని బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు. రాహుల్ ఇదే టీ షర్ట్ ధరించి తిరునల్వేలిలో విలేకరుల సమావేశంలోనూ పాల్గొన్నారని తెలిపారు. రాహుల్ యాత్ర సందర్భంగా వినియోగిస్తున్న కంటైనర్లు కూడా లగ్జరీగా ఉన్నాయని ఆరోపించారు. అయితే.. రాహుల్ పాదయాత్రకు వస్తున్న అనూహ్య స్పందనను చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఎదురు దాడికి దిగారు.

