దేశంలోనే అతి పెద్ద కూరగాయల మార్కెట్‌కు వెళ్లిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్‌ను సందర్శించారు. కాగా ఢిల్లీలోని అతిపెద్ద కూరగాయల మార్కెట్ అయిన ఆజాద్‌పుర్ మండికి ఇవాళ ఉదయం రాహుల్ గాంధీ వెళ్లారు. అక్కడ వ్యాపారులు,స్థానికులతో మాట్లాడి ధరల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా ఆ సమయంలో తీసిన వీడియోను రాహుల్ గాంధీ తన ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. “దేశాన్ని రెండు వర్గాలుగా చీల్చారు. నిత్యవసర వస్తువులు సామాన్యులకు అందడం లేదు. పేద,ధనిక వర్గాల మధ్య తారతమ్యం లేకుండా చూడాలి” అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

