హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ
కులగణనపై మేధావుల అభిప్రాయం తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ తెలంగాణ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు ఆహ్వానించారు. కాంగ్రెస్ శ్రేణులు భారీ కాన్వాయ్‌తో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ నుండి రేవంత్ రెడ్డి కారులో రాహుల్ గాంధీ బోయినపల్లికి బయలు దేరారు. వివిధ ప్రాంతాలనుండి దాదాపు 400 మంది హాజరయ్యారు. బోయినపల్లి గాంధీ ఐడియాలజీ విభాగంలో కులగణనపై సదస్సు జరగనుంది. మళ్లీ సాయంత్రం ఏడున్నర గంటలకు తిరిగి దిల్లీకి ప్రయణం చేస్తారు రాహుల్ గాంధీ.