లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ
అధికార బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎకు పోరాటాన్ని ఉధృతం చేసేందుకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. సభలో ప్రతిపక్షనేతగా రాహుల్ గాంధీ ఇక వ్యవహరించనున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని రాహుల్ గాంధీ ఆమోదించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి హోదాను స్వీకరిస్తానని చెప్పారు. 18వ లోక్‌సభలో స్పీకర్ పదవిపై ఎన్డీఏ, ఇండియా పక్షాల మధ్య రచ్చ నేపథ్యంలో లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ వ్యవహరించనున్నారు. విపక్ష సభ్యునికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలన్న సంప్రదాయాన్ని బీజేపీ తిరస్కరించడం కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. గత లోక్‌సభలో స్పీకర్‌గా పనిచేసిన ఓం బిర్లా తిరిగి, బీజేపీ అభ్యర్థిగా నిలిచారు.