Home Page SliderNational

రాహుల్ గాంధీకి కేరళ ఆయుర్వేద చికిత్స

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం నుండి వారం రోజుల పాటు కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకోబోతున్నారు. మలప్పురం జిల్లాలలోని కొట్టక్కల్ ఆర్య వైద్యశాలకు ఆయన చికిత్సకు వెళ్లారు. ఆయనకు ప్రత్యేకంగా ఈ ఆర్య వైద్యశాల మేనేజింగ్ ట్రస్టీ పి.ఎం. మాధవన్ కుట్టి వారియర్ పర్యవేక్షణలో చికిత్స అందిస్తారని సమాచారం. భారత్ జోడో యాత్ర సందర్భంలో దేశంలోని ఊర్లన్నీ కాలినడకన తిరగడంతో తనకు మోకాళ్ల నొప్పులు వచ్చాయని గతంలో వెల్లడించారు రాహుల్. కానీ ఆయన ఏ ఆరోగ్య విషయంగా చికిత్స తీసుకుంటున్నారో స్పష్టత లేదు. రాహుల్‌తో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ కూడా ఈ వారం రోజులు వైద్యశాలలోనే ఉంటారని పేర్కొన్నాయి కాంగ్రెస్ వర్గాలు.