Home Page SliderTelangana

తెలంగాణాలో పర్యటించే అర్హత రాహుల్‌కు లేదు:కేటీఆర్

ఇటీవల తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే.దీంతో రాష్ట్రంలోని పార్టీలన్నీ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణా ములుగు జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. కాగా ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ హాజరయ్యారు.దీనిపై తెలంగాణా ఐటీ శాఖమంత్రి కేటీఆర్ స్పందించారు. “విభజన హామీలపై ఏనాడు NDA ని ప్రశ్నించని రాహుల్ గాంధీకి తెలంగాణాలో పర్యటించే అర్హత లేదన్నారు.గత 10 ఏళ్ల కాలంలో గిరిజన వర్సిటీలపై రాహుల్ ఎందుకు నోరు మెదపలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైన ఎందుకు బీజేపీని నిలదీయలేదు.కర్ణాటకలో ప్రజలకిచ్చిన హామిలన్నీ వందరోజుల్లోనే బొంద పెట్టిన పార్టీ మీది.మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ప్రభుత్వం మాది” అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.