రాహా పుట్టినప్పటి నుండీ నాలో చెప్పలేని ఆనందం: రణ్‌బీర్ కపూర్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ తన కుమార్తె రాహా పుట్టాక తన జీవితం పూర్తిగా మారిపోయిందంటూ ఎమోషనల్ అయ్యారు. రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ.. ‘రాహా పుట్టినప్పుడు నేను అనుభవించిన ఆనందం నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. ఆ సంతోషం నాకింకా గుర్తుంది. నా కూతురు పుట్టకముందు నేను ఒకలా ఉండేవాడిని, కానీ ఇప్పుడు నాలో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం కొత్త భావోద్వేగాలను, కొత్త ఆలోచనలను అనుభవిస్తున్నాను’ అంటూ రణ్‌బీర్ కపూర్ చెప్పారు.
రణ్‌బీర్ కపూర్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఓ విషయాన్ని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. రాహా జన్మించక ముందు వరకు నాకు మరణం గురించి, ఆరోగ్యం గురించి అసలు భయం ఉండేది కాదు. కానీ, ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాను. గతంలో సిగరెట్ తాగేవాడిని. తండ్రి అయ్యాక వెంటనే మానేశాను అంటూ రణ్‌బీర్ కపూర్ ఎమోషనల్ అయ్యారు.