ఉండి నుంచి పోటీ చేస్తున్నా.. టీడీపీ హైకమాండ్ ఆదేశాలు పాటిస్తా: ట్రిపుల్ ఆర్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగబోతున్నట్టుగా ప్రకటించారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. ఇప్పటికే ఉండి నుంచి మంతెన రాజును టీడీపీ అభ్యర్థిగా ఖరారు చేయగా, అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే రామరాజు, పార్టీ నిర్ణయంపై మండిపడ్డారు. ఐతే, తాజాగా ఉండి టికెట్ ను రఘురామకృష్ణరాజుకు టీడీపీ ఖరారు చేయబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజులతో కలిసి తాను పనిచేసి, నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతానన్నారు ట్రిపుల్ ఆర్. పార్టీ బీఫామ్ అందుకొని ఈనెల 22న సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ఆయన చెప్పారు.
