కేబీసీ లో కోటి రూపాయల ప్రశ్నకు.. మీరు సమాధానం చెప్పగలరా?
“కౌన్ బనేగా కరోడ్‌పతి” ఈ షో గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో పాల్గొనేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు.కొన్ని వారాల క్రితం 14వ సీజన్ ప్రారంభించారు. చదువు తక్కువ ఉన్నా.. లోకజ్ఞానం, రాజకీయ, చారిత్రాత్మక అంశాలపై అవగాహన ఉంటే ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చు. అయితే మనకు ప్రతిభ మాత్రమే కాదు.. అదృష్టం కూడా తోడుంటేనే ఎన్నో అవకాశాలు దక్కించుకోగలం. ఈ కోవలోనే తన ప్రతిభకు.. కాస్త అదృష్టాన్ని జత చేసి.. ఈ షోలో ఓ మహిళ దాదాపు రూ. కోటి వరకు వచ్చి.. చివర్లో జస్ట్ మిస్ అయింది.

కేబీసీ సీజన్ 14లో కేరళకు చెందిన డాక్టర్ అనూ వర్గీస్ అనే మహిళ అన్ని ప్రశ్నలకు వేగంగా సమాధానం చెప్పగలిగింది. కేబీసీ ప్రేక్షకులు అనూ ఈ సీజన్‌లో మొదటి కోటీశ్వరుడుగా వస్తుందని ఆశించగా ఆమె కోటి రూపాయల విలువైన ప్రశ్నకు సమాధానం చెప్పడంలో విఫలమైంది. 15 ప్రశ్నలకు సరైన సమాధానలు చెప్పి రూ. 75 లక్షల గెలుపొందింది.
75 లక్షల రూపాయల ప్రశ్న: ఈ రసాయన మూలకాలలో దేవత పేరు ఏది ?
a)రుథేనియం b)రెనియం c)వేనేడియం d)నికెల్.
అనూ వర్గీస్.. వనాడియం సరైన సమాధానంగా ఎంచుకుంది. ఆమె తన ప్రైజ్ మనీగా రూ. 75లక్షలు తీసుకుంది. అయితే దురదృష్టవశాత్తు 16వ ప్రశ్నకు తప్పు సమాధానం చెప్పడంతో తృటిలో రూ. కోటి రూపాయలను మిస్ చేసుకుంది. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటంటే..
కోటి రూపాయల ప్రశ్న: మొదటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలైన కొన్ని పోస్టల్ స్టాంపులపై ఏమని రాసి ఉంది?
a) సారే జహాసే అచ్ఛా b) రఘుపతి రాఘవ రాజా రామ్ c) జన గణ మన, d) వందేమాతరం.
ఈ ప్రశ్నకు అనూ వర్గీస్ సరైన సమాధానం ఇవ్వలేకపోయింది. దీనితో రూ. 75 లక్షలు గెలుచుకుంది. మరి ఈ కోటి రూపాయల ప్రశ్నకు మీకు సమాధానం తెలుసా.!