Home Page SliderTelangana

“క్వాలిటీ కంట్రోల్ బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటించాలి”..కీలక ఆదేశాలు

గ్రేటర్ పరిధిలో క్వాలిటీ కంట్రోల్ బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటించాలి. త్రాగునీరు సరఫరాలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దాన కిషోర్ జలమండలి అధికారులకు సూచించారు. వర్షాల వల్ల త్రాగునీరు కలుషితం అయ్యే అవకాశం ఉన్నందున నీటిని సేకరించింది మొదలు వినియోగదారులకు సరఫరా చేసే వరకు.. నిల్వ చేయడం, శుద్ధి ప్రక్రియ, క్లోరినేషన్, పంపింగ్, ట్రాన్స్ మిషన్, డిస్ట్రిబ్యూషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

 సమస్యాత్మక ప్రాంతాల్లో జలమండలి అధికారులు, GHMC అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. వాటర్‌లాగింగ్ పాయింట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముంపు ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. సాధ్యమైన ప్రాంతాల్లో క్లోరిన్ బిల్లులు పంపిణీ చేయాలని సూచించారు. కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. పని చేసే ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్‌హోల్స్‌ తెరవకుండా చూడాలన్నారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ప్రజా ఫిర్యాదుల పై సత్వరమే స్పందించాలని చెప్పారు. భారీ వర్షాలకు జలమండలి కి చెందిన ఆస్తుల నష్ట వివరాలను అందజేయాలన్నారు.