అమెరికా అధ్యక్షునికి పుతిన్ కానుక
ఉప్పు నిప్పులా ఉండే అమెరికా, రష్యాల మధ్య స్నేహ కమలం విచ్చుకుంటోంది. తాజాగా రష్యా -ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపి శాంతి నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ కానుకను పంపించడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ మాస్కోలో పర్యటించగా, ఆయనకు ట్రంప్ చిత్రపటాన్ని ఇచ్చి ట్రంప్‌కు అందజేయాలని పుతిన్ కోరినట్లు సమాచారం. ప్రస్తుతం ట్రంప్ ప్రతిపాదించినట్లు 30 రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్, రష్యా దేశాలు అంగీకరించాయి. గతంలో ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై కాల్పులు జరిగిన ఘటనలో ఆయన చెవికి గాయం తగిలిన సంగతి తెలిసిందే. అప్పట్లో పుతిన్ ట్రంప్ క్షేమం కోసం ప్రార్థనలు చేశారని మాస్కో తెలిపింది.