Andhra PradeshHome Page Slider

తిరుమలలో కనువిందు చేసిన పుష్పపల్లకీ సేవ

తిరుమలలో జరిగే ఉత్సవాలు చూడాలంటే రెండుకళ్లూ చాలవు. ఆణివార ఆస్థానం సందర్భంగా సోమవారం రాత్రి జరిగిన స్వామివారి పుష్పపల్లకి సేవ భక్తులందరికీ కనువిందు చేసింది. ఆరు రకాల సంప్రదాయాలకు చెందిన ఒక టన్ను  పుష్పాలతో స్వామివారి పల్లకిని అలంకరించారు. దానికి ముందు సాలకట్ల ఆణివార ఆస్థానం కూడా శ్రీవారి ఆలయంలో వైభవోపేతంగా జరిగింది. మలయప్ప స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ఈ పుష్ప పల్లకిని అధిరోహించగా, గోవిందనామస్మరణతో తిరువీధులు దద్ధరిల్లాయి. మాడవీధులలో ఊరేగించిన స్వామివారిని చూడడానికి భక్తులు భారీగా వచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టిటిడీ ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.