‘పుష్ప’ తొక్కిసలాట ఘటన..బాలుడికి ప్రభుత్వం నుండి భారీ సాయం..
సంధ్య థియేటర్ వద్ద ‘పుష్ప-2’ చిత్రం ప్రీమియర్ షోలో తొక్కిసలాట ఘటనపై నేడు అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై చాలా ఆవేదన చెందుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌కు భారీ సహాయం అందించడానికి నిర్ణయించింది. అతడికి ప్రభుత్వం తరపున వైద్య ఖర్చులను భరిస్తామని, అతని కుటుంబానికి సహాయంగా రూ.25 లక్షలు అందించనున్నట్లు మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. అతని తల్లి రేవతి ఇదే ఘటనలో మృతి చెందారు. ప్రస్తుతం అతనికి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని, శ్వాస తీసుకునే స్థితిలో లేనందువల్ల వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

