Home Page SlidermoviesNationalNews Alert

బెంగాల్లో ‘పుష్ప-2’ రప్పారప్పా

‘పుష్ప-2’ చిత్రం విడుదలై నెల దాటినా ఇంకా  రికార్డులు తిరగరాస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ డైలాగ్ చెప్పినట్లు ‘రప్పా.. రప్పా’ అంటూ కలెక్షన్లతో దూసుకుపోతోంది.  సినీ పరిశ్రమ చరిత్రలో ఎన్నడూ లేనిది వెస్ట్ బెంగాల్లో రూ.50 కోట్లు వసూలు చేసింది. బెంగాలీ చిత్రాలు కూడా ఇప్పటి వరకూ అంత కలెక్షన్స్ రాలేదని సమాచారం. ఒక డబ్బింగ్ చిత్రం ఇలా ఆల్‌టైమ్ రికార్డు సాధించడం మామూలు విషయం కాదు. సంక్రాంతి పండుగ అనంతరం జనవరి 17న ఈ చిత్రం రీలోడ్ వెర్షన్ మరో 22 నిమిషాల డిలీటెడ్ వెర్షన్‌ను యాడ్ చేసి విడుదల చేయబోతున్నట్లు మూవీ టీం పేర్కొంది. ఈ సందర్భంగా చిత్రం మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1830కోట్లకు పైగా వసూలు చేసిన సంగతి తెలిసిందే.