Home Page SliderNationalNews AlertTrending Today

పుష్ప-2 మూవీ లీక్..యూట్యూబ్‌లో చూస్తున్న ప్రేక్షకులు

పుష్ప-2 నిర్మాతలకు షాకింగ్ న్యూస్. ఈ చిత్రం హిందీ వెర్షన్ విడుదలైన రోజే పలు ఆన్‌లైన్ సైట్లలో కనిపిస్తోందని వార్తలు వస్తున్నాయి. తాజాగా హిందీ పుష్ప మూవీని పలువురు యూట్యూబ్‌లో విడుదల చేసే ఉద్దేశంతో లీకులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని సన్నివేశాలు ఇప్పటికే యూట్యూబ్‌లో ప్రేక్షకులు చూసేస్తున్నారని అల్లు అర్జున్ అభిమానులు ఫీలవుతున్నారు. ఈ చిత్రంపై ఫాహిద్ ఫజిల్ పోషించిన షెకావత్ పాత్రపై కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.  తమ కులానికి చెందిన షెకావత్‌ను విలన్‌గా చూపించారని క్షత్రియ కర్ణి సేన లీడర్ రాజ్ షెకావత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలలో క్షత్రియులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. షెకావత్‌ అనే పదాన్ని చిత్రం నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.