Breaking NewscrimeHome Page SliderNational

గ్యాంగ్‌స్ట‌ర్‌ను ప‌ట్టించిన పుష్ఫ 2

మోస్ట్ వాంటెడ్ కిల్ల‌ర్‌,డ్ర‌గ్ స్మ‌గ్ల‌ర్ విశాల్ మేశ్రాం పుష్ప 2 మూవీ చూస్తూ నాగ్ పూర్ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు.నాగ్‌పుర్‌లోని ఓ మల్టీప్లెక్స్ థియేటర్‌లో పుష్ప-2 సినిమా చూస్తుండగా గ్యాంగ్‌స్టర్‌ విశాల్ మేశ్రాంను చుట్టుముట్టి పోలీసులు అరెస్ట్ చేశారు.ఒక స్మ‌గ్ల‌ర్‌…ఇంకో స్మగ్ల‌ర్ మూవీకి క‌చ్చితంగా వ‌స్తాడ‌న్న న‌మ్మ‌కంతో వ‌ల‌ప‌న్ని అరెస్ట్ చేసిన‌ట్లు నాగ్‌పూర్ సీపి తెలిపారు. ప‌దినెల‌లుగా త‌ప్పించుకు తిరుగుతున్న మేశ్రాంను ప‌ట్టుకునేందుకు అన్నీ థియేట‌ర్ల వ‌ద్ద నిఘా ముమ్మ‌రం చేశారు. ఈ విష‌యంలో పాంచ్ పావలీ పోలీసుల కృషి ఎంతో ఉంద‌ని సీపి అభినందించారు. విశాల్ మేశ్రాంపై రెండు హత్యలు, డ్రగ్స్ అక్రమ రవాణా, హింసాత్మక ఘటనలతో పాటు మొత్తం 27 కేసులు ఉన్నాయని.. విశాల్ కారు కదలికలను పసిగట్టి ఎట్టకేలకు పట్టుకున్నామని తెలిపిన పోలీసులు.