ప్రజా నాయకుడు వైఎస్ఆర్: రాహుల్ గాంధీ
అసలైన ప్రజా నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్ఆర్) అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. వైఎస్ఆర్ బతికి ఉంటే ఏపీ ముఖచిత్రం వేరేలా ఉండేది. వైఎస్ఆర్ వారసత్వాన్ని షర్మిలా సమర్ధవంతంగా ముందుకు తీసుకు వెళ్తుంది. వైఎస్ఆర్ పాదయాత్ర నా జోడో యాత్రకు స్ఫూర్తి. నేడు వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు రాహుల్ తెలిపారు.

