ఈ అలవాట్లతో పిల్లలపై మానసిక క్షోభ
తరుచుగా చిన్నారులు ఆరోగ్య సమస్యలకు లోనవుతుంటారు. చిన్న తనమున వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకున్నట్లయితే ఆ సమస్యలు వారిని వారి జీవితాంతము వెంబడిస్తుంటాయి. చిన్నప్పుడు వారి మానసిక ఆరోగ్యమే మొత్తం శ్రేయస్సు, భవిష్యత్ ను ప్రభావితం చేస్తుంది. అందుకే తల్లిదండ్రులు ముందుగా పిల్లల ఆరోగ్యం గురించే ఆలోచించాలి. వారు యాక్టివ్గ్ గా, తెలివిగా ఉండాలని నాణ్యమైన పోషకాహారాన్ని అందించాలి. అయితే కొన్ని రకాల అలవాట్లు, పరిస్థితులు వారి మెదడు పనితీరును, సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని, కాబట్టి వాటికి దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా భయపెట్టే సంఘటనలు, నెగిటివ్ సమాచారాన్ని ఎక్కువగా వినడం, చూడడం వల్ల పిల్లలపై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి పసిపిల్లలను ఒంటరిగా వదిలేయవద్దు. ఒంటరితనం క్రమంగా వారిలో డిప్రెషన్ కు దారితీయవచ్చు. అలాగే అధిక శబ్దాలు, తరచుగా ఫోన్లు చూడటం కూడా పిల్లల బ్రెయిన్ పై ప్రతి కూల ప్రభావం చూపుతాయి. కాబట్టి సౌండ్ పొల్యూషన్ కు దూరంగా ఉంచాలని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.


 
							 
							