నడిరోడ్డుపై సైకో హల్ చల్
హైదరాబాద్ శివారు ప్రాంతం పోచారం మున్సిపాలిటీలో ఓ సైకో హల్ చల్ చేశాడు. నేషనల్ హైవే మీద రాళ్లు పట్టుకొని పరుగులు తీస్తూ రోడ్ల మీద వెళ్తున్న కార్లు, బైకులు, ప్రజలపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన వారిపై కత్తితో పొడిచేందుకు తెగించాడు. ఒక్కసారిగా జనం భయంతో పారిపోయారు. కొందరు యువకులు ధైర్యం చేసి ఎట్టకేలకు అతడిని పట్టుకున్నారు. తాళ్లతో కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.