FAKE NEWS ప్రచారం చేస్తే కుదరదు – 10 లక్షలు జరిమానా
సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, తప్పుడు ప్రకటనలు ఇచ్చేవారి ఆటకట్టు కాబోతోంది. సామాజిక మాధ్యమాలు మన చేతిలో ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్లు యూట్యూబ్‌లో, వాట్సాప్‌లలో, ఇతర సోషల్ మీడియాలలో అవాస్తమైన, ఆధారం లేని వార్తలు ప్రచారాలు చేస్తే చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరో 15 రోజుల్లో ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని విడుదల చేయనుంది. ప్రజలను తప్పుదోవ పట్టించేవారి నుండి కాపాడడమే లక్ష్యంగా మార్గదర్శకాలు విడుదల చేయనుంది. ఎవరైనా ఆ నిబంధనలు పాటించకపోతే 10 లక్షల వరకూ జరిమానా విధిస్తారు. పదేపదే ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం 50 లక్షల రూపాయలు జరిమానా పడుతుంది. ఏదైనా బ్రాండ్‌కు ప్రచారం చేసే వ్యక్తులు స్పష్టమైన, వాస్తవ సమాచారాన్ని మాత్రమే అందించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. బ్లాగర్లను, యూట్యూబర్లను, బ్రాండ్ ఎంబాసిడర్స్‌ను ఈ చట్టం క్రిందకు తీసుకురానుంది. ఫేక్ న్యూస్, తప్పుదోవ పట్టించే ప్రకటనల నుండి ప్రజలను రక్షించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

