వయనాడ్ లో ప్రియాంక గాంధీ నామినేషన్
మొదటి సారి తన కోసం తాను ఎన్నికల ప్రచారం చేస్తున్నానని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. కేరళలోని వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికకు ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. వయనాడ్ ఎంపీ స్థానానికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో జరుగుతున్న ఉప ఎన్నికకు ప్రియాంక మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేసే ముందు బహిరంగ సభలో మాట్లాడిన ఆమె.. తాను ఇప్పటి వరకు ఇతరుల కోసం వేర్వేరు ఎన్నికలలో ప్రచారం చేశాను. అయితే నేను స్వయంగా ప్రచారం చేసుకోవడం ఇదే తొలిసారి అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రియాంక.నవంబర్ 13న ఓటింగ్ ఓటింగ్ జరగనుంది. మహారాష్ట్ర, జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.


 
							 
							