కుంభమేళాలో ప్రధాని పుణ్యస్నానం
కోట్లాది మంది పాల్గొనే ఆధ్యాత్మిక పుణ్యస్నానాల కుంభమేళాలో నేడు ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. కొద్ది సేపటి క్రితం ప్రయాగరాజ్‌లో ఆయన త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. ప్రయాగరాజ్ విమానాశ్రయానికి చేరిన ప్రధాని సరాసరి అరైల్ ఘాట్‌కు వెళ్లారు. ఘాట్ నుండి బోటులో ప్రయాణించి మహా కుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని, త్రివేణీ సంగమంలో ప్రధాని పుణ్యస్నానం ఆచరించారు.