Home Page SliderInternationalPolitics

అంతర్జాతీయ కోర్టుకు ఇజ్రాయెల్ ప్రధాని

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి గల్లాంట్‌లపై అంతర్జాతీయ న్యాయస్థానం జారీ చేసిన అరెస్టు వారంటును రద్దు చేయాలని కోరుతూ ఐసీసీని ఆశ్రయించారు. ఈ మేరకు ఇజ్రాయెల్  ప్రధాని కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు తమపై పక్షపాతంతో వ్యవహరిస్తోందని అందుకే వీటిని సవాల్ చేస్తూ పిటిషన్ వేశామని తెలిపారు. ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య జరిగిన యుద్ధంలో గాజాలో అనేక వేల మంది మృతి చెందారు. అక్కడ అమానవీయ చర్యలు, ఆకలి చావులు, బాంబు దాడులు వంటి అఘాయిత్యాలు జరిగినట్లు గుర్తించామని ఐసీసీ పేర్కొంది. దీనితో మానవ సంక్షోభం ఏర్పడిందని, చిన్నారులు బాధితులుగా మారారని, అనాధలుగా మారారని మండిపడింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని, రక్షణ మంత్రి దానికి కారణమంటూ అరెస్టు వారెంట్‌ను జారీ చేసింది. తమపై ఆరోపణలు అసంబద్ధమైనవని, తప్పుడు చర్యలని పేర్కొంటూ నెతన్యాహు ఈ వారెంట్‌ను ఖండించారు.