భూటాన్ ప్రధాని-భారత ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ భూటాన్‌కు చేరుకున్నారు. ఆ దేశ ప్రధాని షెరింగ్ టోబ్‌గే.. మోడీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురూ ఆత్మీయ ఆలింగనం, కరచాలనం చేసుకున్నారు. అనేక రంగాల్లో భారత్-భూటాన్ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో పలు కార్యక్రమాలకు హాజరు కానున్నట్లు మోడీ ఎక్స్‌లో పోస్టు చేశారు. మన దేశ సహకారంతో నిర్మించిన మదర్ అండ్ చైల్డ్ ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు.