Home Page SliderTelangana

హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ

అనుకున్నట్టుగానే 11.30 నిముషాలకు ప్రధాని మోదీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రధానికి తెలంగాణా గవర్నర్ తమిళిసై ఆహ్వానం పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మంత్రి తలసాని యాదవ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులు ప్రధానికి ఆహ్వానం పలకారు. ప్రధాని నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. రైలులో అప్పటికే వేచి ఉన్న స్కూలు పిల్లలతో ముచ్చటించారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు జెండా ఊపి ప్రారంభం చేశారు మోదీ. అనంతరం సికింద్రాబాద్ స్టేషన్ ఆధునికీకరణకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారత రైల్వేమంత్రి, ఇతర రైల్వే అధికారులు, గవర్నర్ పాల్గొన్నారు. ఈ రైలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు తిరుపతి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరిగి తిరుపతిలో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు చేరుకుంటుంది. కేవలం 8 గంటలలోనే తిరుపతికి చేరుకుంటుంది ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్. అనంతరం పెరేడ్ గ్రౌండ్స్‌లో 12.30 గంటలకు రైల్వే స్టేషన్‌ పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. ఇతర అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. 12.50 నుండి ఒక అరగంట పాటు ప్రధాని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా సీఎం ప్రసంగం కూడా ఉంది. కానీ సీఎం కేసీఆర్ మాత్రం గైర్హాజరవుతున్నట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా తెలంగాణాలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.