Andhra PradeshHome Page Slider

వెంకయ్య నాయుడికి ప్రధాని మోడీ శుభాకాంక్షలు

నేడు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పుట్టినరోజు. ఈ సందర్భంగా వెంకయ్యకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి రాజనీతిజ్ఞుడు ఎం.వెంకయ్య నాయుడు 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను. వెంకయ్య వాగ్ధాటి, తెలివితేటలు ఆయనకు గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. ఆయన శ్రేయోభిలాషులు, మద్దతుదారులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేసిన ప్రధాని మోడీ.