Home Page SliderTelangana

ఎస్సీ వర్గీకరణకు ప్రధాని సుముఖతతో ఉన్నారు

చొప్పదండి: ఎస్సీ వర్గీకరణకు ప్రధాని మోడీ చొరవ చూపారని, వారి న్యాయమైన డిమాండ్‌ను త్వరితగతిన పూర్తి చేస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. బీజేపీ అభ్యర్థి బొడిగ శోభకు మద్దతుగా శుక్రవారం చొప్పదండిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లింల వివాహాలకు రూ.2 లక్షలు ఇస్తే, హిందువులకూ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అపవిత్ర పొత్తు కొనసాగుతోందని, ఆ రెండు పార్టీలు ఒక్కటేనని పేర్కొన్నారు. అనంతరం ఈటల రాజేందర్ ఫోన్‌లో మాట్లాడారు. బీజేపీతోనే అన్నివర్గాల సంక్షేమం సాధ్యమన్నారు. పార్టీ అభ్యర్థి బొడిగ శోభ మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధి పనులు చేశానని తనకు మరోసారి అవకాశమివ్వాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.