నగరాల్లో కంటే పల్లెల్లోనూ కూరగాయల ధరలు ఎక్కువా!
పల్లెల్లో పండించే కూరగాయల ధరలు నగరంలోని ప్రజలకు అందుబాటులో ఉండేలా రెండు దశాబ్దాల క్రితం రైతుబజార్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఆలోచన ద్వారా నగరంలోని ప్రజలకు కూరగాయలు అందుబాటు ధరలలోనే లభిస్తున్నాయి. మరి ఈ విధంగా చూస్తే ఇవి పండించే ప్రాంతోల్లో వీటి ధర ఇంకా తక్కువగా ఉంటుందనేది మన అందరి అభిప్రాయం. ఇటువంటి అభిప్రాయం మీకు ఉంటే మీరు పప్పులో కాలు వేసినట్టే. అవునండీ…మీరు విన్నది వాస్తవమే. నగరాల్లోని ప్రజలకంటే పల్లెల్లోని , మండలాల్లోని 50 నుండి 70 శాతం అధిక రేటుకు కురగాయాలు విక్రయిస్తున్నారు. పండించిన వాడికే పసిడిలా మారుతున్నాయి. నగరాల్లోని ప్రజలకంటే వారే అధిక ధరలకు కురగాయలను కొనుగోలు చేయాల్సి వస్తోంది. నగరంలో 1కి.లో టమాట ధర రూ.50 ఉండగా , అక్కడ అంతకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. మరికొన్ని చోట్లా వాటి ధర రూ.60 పైనే . చేసేదేం లేక… కొద్ది మొత్తంలో కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు సామాన్యులు. మరోవైపు కొద్ది రోజులుగా నిరంతరం కురుస్తున్న వర్షాలతో పంట కూడా పూర్తిగా చేతికి రావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

