స్టాలిన్‌కు రాష్ట్రపతి షాక్..
తమిళనాడులోని స్టాలిన్ సర్కారుకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము షాక్ ఇచ్చారు. తమిళనాడు పంపిన నీట్ వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి తిరస్కరించారు. ఈ విషయాన్ని సీఎం స్టాలిన్ రాష్ట్ర అసెంబ్లీలో వెల్లడించారు. మన సర్కారు అన్ని వివరణలు ఇచ్చినా నీట్ నుండి తమిళనాడును మినహాయించలేదన్నారు. కానీ మన పోరాటాన్ని ఆపలేరని, న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తామని పేర్కొన్నారు. స్టాలిన్ ప్రభుత్వం నీట్ పరీక్ష వల్ల తమిళనాడులో విద్యార్థులలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, నీట్ పరిధి నుండి తమిళనాడును శాశ్వతంగా మినహాయించాలని పేర్కొంటూ బిల్లును ప్రవేశపెట్టింది. 12 వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు వైద్య కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని కోరింది. దీనిని అసెంబ్లీ ఆమోదించినా, గవర్నర్ రెండు సార్లు తిరస్కరించారు. దీనితో మార్పులు చేసి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా, అది కూడా తిరస్కరించబడింది.