ఫిబ్రవరి నెలాఖరులోగా తెలంగాణలో రాష్ట్రపతి పాలన – ఉత్తమ్ కుమార్
ఫిబ్రవరి నెలాఖరులోగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన
కాంగ్రెస్ నేత ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జోస్యం
తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో ఫిబ్రవరి నెలాఖరులోగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు ఉన్నాయని నల్గొండ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కోదాడలో జరిగిన హత్ సే హత్ జోడో అభియాన్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరిగితే రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ కేంద్రాన్ని కోరుతుందని అన్నారు. పార్టీ సభ్యులపై పోలీసుల వేధింపులకు నిరసనగా లోక్‌సభ బడ్జెట్ సమావేశాల అనంతరం కోదాడలో జైల్ భరో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.


