శ్రీశైలం పుణ్యక్షేత్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
శీతాకాలం విడిది కోసం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి సత్యవతి రాథోడ్ స్వాగతం పలికారు. అక్కడ్నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో బయల్దేరారు. రాష్ట్రపతి వెంట కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. ఇవాళ శ్రీశైలంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రసాద్ పథకంలో భాగంగానే పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. తిరిగి సాయంత్రం, హైదరాబాద్ చేరుకుంటారు. రేపట్నుంచి తెలంగాణలో పలు కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొంటారు.