Andhra PradeshHome Page Slider

రేపు శ్రీశైలానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఈనెల 26న శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమె పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను చేయటంలో అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు చేరుకున్న అనంతరం అక్కడ నుంచి రాష్ట్రపతి రోడ్డు మార్గాన శ్రీశైలం చేరుకోనున్నారు. ఈ మేరకు అధికారులు ట్రయల్ రన్ ను పరిశీలించారు. శ్రీశైలం చేరుకున్న అనంతరం స్వామి అమ్మవార్ల దర్శనం అయ్యాక, ప్రసాదం స్కీం పథకం ద్వారా నూతనంగా నిర్మించిన సి.ఆర్.ఓ ఆఫీసును ఆమె ప్రారంభిస్తారు. అక్కడ నుంచి శ్రీశైలంలో ఉన్న శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు.