Home Page SliderTelangana

తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా ఏం చెప్పారంటే..!

ఎన్నికలెప్పుడొచ్చినా సిద్ధం..
ఎవరో వస్తారని పార్టీ ఎదురు చూడటం లేదు
ఎవరు పార్టీలోకి వచ్చినా ఆపే పరిస్థితి లేదు..!
అమిత్ షాతో భేటీ తర్వాత బీజేపీ చీఫ్ బండి
భేటీలో కిషన్ రెడ్డి, ఈటల, డీకే అరుణ, ఇతర బీజేపీ నేతలు
ఉమ్మడి జిల్లాల్లో భారీ బహిరంగ సభలు

తెలంగాణ బీజేపీ కోర్ టీమ్ సభ్యులు, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రితోపాటుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికలెప్పుడొచ్చినా సిద్ధం ఉండాలని పార్టీ పెద్దలు సూచించినట్టు తెలుస్తోంది. పోటీ చేసేందుకు తగినంత మంది నాయకులు లేరన్న ప్రశ్నకు బండి సంజయ్ సమాధానం చెప్పారు. గతంలోనూ 119 నియోజకవర్గాల్లో పోటీ చేశామని.. పార్టీ సీట్ల కోసం నేతల మధ్య పోటీ ఎక్కువగా ఉందన్నారు బండి సంజయ్. కావాలనే ఒక సెక్షన్ మీడియా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తోందన్నారు. అందుకే బీజేపీకి అభ్యర్థుల్లేరని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో రోజు రోజుకు పార్టీ బలోపేతమవుతోందన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ మరిన్ని కార్యక్రమాలు చేస్తామన్నారు.

ఎవరో వస్తారని బీజేపీ ఎదురు చూడటం లేదు. ఎవరొచ్చినా ఆపే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పార్టీని ఇంకా బలోపేతం చేయడం, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు బండి. ప్రభుత్వాన్ని గద్దె దించాలని చూస్తున్నారన్నారు. మార్పు రావాలని కోరుకుంటున్న తరుణంలో ప్రత్యామ్నాయం బీజేపీ అని భావిస్తున్నారన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. అందులో భాగంగానే దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రజలు తీర్పు వచ్చిందన్నారు. బీజేపీ ముఖ్యలతో లిక్కర్ కుంభకోణంపై చర్చ జరిగిందన్న ప్రశ్నకు.. అలాంటిదేమీ లేదన్నారు సంజయ్. కేవలం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా బలోపేతం చేయాలన్నదానిపైనే ఫోకస్ పెట్టారన్నారు. లిక్కర్, డ్రగ్స్… ఏ కేసునైనా దర్యాప్తు సంస్థలు చట్ట ప్రకారం పనిచేస్తాయన్నారు. ఎవరిపై ఆరోపణలుంటే వారిని విచారిస్తారన్నారు.

గతంలో దేశంలో బీజేపీకి రెండు ఎంపీలే ఉన్నాయని.. కానీ నేడు వరుసగా రెండు టర్మ్‌లు అధికారంలోకి వచ్చామన్నారు సంజయ్. పార్టీ వర్షన్ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 11 వేల కార్నర్ మీటింగ్స్ పెట్టామన్నారు. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా స్పందిస్తోంది ఒక్క బీజేపీయేనన్నారు. ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహించి… రాష్ట్రంలో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నదానిపై… కేంద్ర పార్టీ ముఖ్యలు, తెలంగాణ నేతలతో చర్చించారన్నారు. త్వరలో తెలంగాణ అంతటా సభలు, సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఉమ్మడి 10 జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని అనుకుంటున్నామన్నారు. ప్రజాందోళన కార్యక్రమాల్లో పాల్గొంటూ.. పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేయాలని హైకమాండ్, తెలంగాణ బీజేపీ నేతలను ఆదేశించింది.