నైట్ సఫారీకి సన్నాహాలు
కుక్టైల్ నైట్ సఫారీ, అడ్వెంచర్ పార్క్ పేరిట దేశంలోనే తొలిసారి పార్క్ ఏర్పాటుకు యూపీ సర్కారు ముందుకొచ్చింది. పర్యాటక అభివృద్ధితో పాటు పచ్చదనం పెంపు, వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యంగా రూ.1,500 కోట్లతో రెండు దశల్లో లక్నోలోని కుకైల్ రక్షిత అటవీ ప్రాంతం సమీపంలో దీన్ని అభివృద్ధి చేయనుంది. ప్రఖ్యాత ‘సింగపూర్ నైట్ సఫారీ’ స్ఫూర్తితో యూపీ ప్రభుత్వం 850కుపైగా ఎకరాల్లో ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.యూపిలో విశాలమైన నిరుపయోగ మైదానాలు,పీఠభూములు ఉండటంతో యోగి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.