Home Page SliderNationalNews AlertPolitics

 బెడిసికొట్టిన ప్రశాంత్ కిషోర్ నిరాహార దీక్ష

బిహార్‌ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలలో అవకతవకలు చోటు చేసుకున్నాయని రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెట్టారు. పట్నాలోని గాంధీమైదాన్‌లో మహాత్ముడి విగ్రహం వద్ద ఈ దీక్ష మొదలు పెట్టారు. అయితే అతని దీక్ష బెడిసికొట్టింది. పలు విమర్శలు ఎదుర్కొంటోంది. దీనికి కారణం అక్కడ సమీపంలో ప్రశాంత్ కిషోర్‌కు చెందిన కోట్ల రూపాయల వ్యానిటీ వ్యాన్ ఉండడం. ఆ వ్యాన్‌లో ఏసీ, కిచెన్, బెడ్‌రూం వంటి సకల సదుపాయాలు ఉన్నాయి. దీనిపై రాజకీయ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. దీనిపై జన్ సురాజ్ పార్టీ ప్రతినిధి స్పందిస్తూ.. ఈ వ్యాన్ విషయం గురించి మాట్లాడడం సమస్యను పక్కదారి పట్టించడానికే అని, పీకే ప్రతిష్టకు భంగం కలిగించేందుకే ఆ విషయం తీసుకువస్తున్నారని ఆరోపించారు. మరోపక్క విద్యార్థుల సమస్య పరిష్కారం అవ్వాలని, పరీక్షను రద్దు చేసి, కొత్తగా నిర్వహించాలని ప్రశాంత్ కిషోర్ డిమాండ్ చేస్తున్నారు.