Andhra Pradeshhome page sliderHome Page SliderNewsNews AlertPoliticsTrending Todayviral

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని టార్గెట్ చేసిన ప్ర‌కాష్‌రాజ్..

హీరో పవన్ కళ్యాణ్ చేసిన హిందీ భాషపై చేసిన వ్యాఖ్య‌లు వివాదానికి కేంద్ర బిందువయ్యాయి. హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన రాజ్య భాషా విభాగం గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న పవన్ మాట్లాడుతూ, హిందీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాతృభాష తెలుగు అమ్మ అయితే, హిందీ పెద్దమ్మ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ చెప్పారు. హిందీని వ్యతిరేకించడం అంటే రాబోయే తరాల అభివృద్ధిని అడ్డుకోవడమే అవుతుందని పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యల వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ప్రకాష్‌రాజ్ రెచ్చిపోయారు.. “ఈ రేంజ్‌కి అమ్ముకోవడమా… ఛీ ఛీ…” అంటూ కౌంటర్ ఇచ్చారు. దీనిపై సెటైరిక్ టోన్‌లో విమర్శలు గుప్పించారు. ప్ర‌కాష్‌రాజ్ వ్యాఖ్యలకు జనసేన అభిమానులు, నెటిజన్లు కౌంట‌ర్ ఇస్తున్నారు. నువ్వన్నట్టు అంద‌రూ మిగ‌తా భాష‌ల‌ని ద్వేషించుకుంటూ పోతే ఇన్ని సినిమాలు నువ్వు చేసేవాడివా, ఇంత సంపాదించే వాడివా? జాతీయ స్థాయిలో ఇంత పేరు ప్ర‌ఖ్యాతులు వచ్చేవా? ఇంత హైక్లాస్ జీవితం అనుభవించేవాడివా ప్ర‌కాష్‌రాజ్ అన్నా అంటూ ఒక జ‌న‌సైనికుడు కౌంటర్ ఇచ్చారు. గ‌తంలో కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన కొన్ని కామెంట్స్‌పై ప్ర‌కాష్‌రాజ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే ఏ రోజు కూడా ప్ర‌కాష్‌రాజ్ ట్వీట్స్‌పై ప‌వ‌న్ స్పందించింది లేదు. మ‌రి తాజా ట్వీట్‌పై ప‌వ‌న్ నుండి ఏదైన రియాక్ష‌న్ వ‌స్తుందో లేదో వెయిట్ అండ్ సీ..