ఇన్‌స్టాగ్రామ్‌లో పవర్‌స్టార్ ఎంట్రీ..క్షణాల్లోనే లక్షల్లో ఫాలోవర్స్
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పవరేంటో మరోసారి రుజువైంది. కాగా ఆయన తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో పవన్ ఎంట్రీ ఇచ్చిన కొద్దిసేపటికే ఆయన 3.5లక్షల మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. కాగా “ఎలుగెత్తు ,ఎదురించు,ఎన్నుకో..జై హింద్” అని పవన్ తన బయోలో పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తే బాక్సాఫీసే కాదు..సోషల్ మీడియా కూడా షేక్ అవ్వాల్సిందే అని పవన్ ఫ్యాన్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ ఎంట్రీ ఇచ్చారని ట్విటర్‌లో ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో #Pawankalyanininstagram ట్విటర్‌లో ట్రెండింగ్ నెం.1లో కొనసాగుతోంది.