పదవులు ముఖ్యం కాదు..రాష్ట్ర పునర్నిర్మాణమే ముఖ్యం- చంద్రబాబు
తమ పార్టీకి కేంద్రప్రభుత్వంలో లభించిన రెండు మంత్రి పదవులతో తాము సంతృప్తిగా ఉన్నామని వెల్లడించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తమకు రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. తమ పార్టీ ఏనాడూ ఎన్డీయే ప్రభుత్వంలో పదవులు ఆశించలేదన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్‌కు విభజన జరిగినప్పటి కంటే ఎక్కువ నష్టం జరిగిందన్నారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి ఎన్నో సహజ వనరులు ఉన్నాయని, నదుల అనుసంధానం ద్వారా అద్భుతాలు సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. గతంలో వాజపేయి ప్రధానిగా ఉన్న కాలంలో కూడా ఏడు మంత్రి పదవులు తీసుకోవాలని చెప్పినా, తాము తీసుకోలేదన్నారు.